దొంగతనాన్ని సమర్థించిన జగన్ క్షమాపణ చెప్పాలి: బుచ్చి రాంప్రసాద్

పరకామణి దొంగతనాన్ని సమర్థించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ డిమాండ్ చేశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Update: 2025-12-22 09:53 GMT

మంగళగిరి: పరకామణి దొంగతనాన్ని సమర్థించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ డిమాండ్ చేశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పరకామణి అంటే వెంకటేశ్వరస్వామికి భక్తులు ఇచ్చే కానుకలు. భక్తి శ్రద్ధలతో, కష్టపడి సంపాదించిన డబ్బు, బంగారం, నిలువు దోపిడీ, తలనీలాలు వంటివి దేవుడికి సమర్పించుకుంటారు. కొందరు మొక్కు కోరికలు తీరితే తలనీలాలు ఇస్తామని ప్రతిజ్ఞ చేసి, పసుపు గుడ్డలో డబ్బులు దాచుకుని వచ్చి హుండీలో వేస్తారు. ఇవన్నీ భక్తి విశ్వాసాలకు చెందినవే. బ్రిటిష్ వారు కూడా శ్రీ వెంకటేశ్వరస్వామిపై భక్తి, గౌరవంతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అభివృద్ధి చేశారు. 1939లో టీటీడీ పేరుతో పాలక మండలి ఏర్పడింది. ఇప్పటికీ దాదాపు 90 ఏళ్లు అయింది. కలియుగంలో ప్రజల కష్టాలను, నష్టాలను అక్రమవాదుల నుంచి కాపాడటానికి శ్రీ వెంకటేశ్వరస్వామివారు దేవదేవుడి రూపంలో అవతరించారు. అలాంటి స్వామివారికి సంబంధించిన కానుకలనే దోచేశారు. ఇంతకు ముందు ఎన్నడూ జరగని విధంగా అక్రమాలు జరిగాయి.’’ అని చెప్పారు.

‘‘ పరకామణిలో జరిగిన అక్రమాలు, దేవదేవుడిపై జరిగిన కుట్రలు నన్ను తీవ్రంగా కలిచివేశాయి. వైసీపీ హయాంలో రూ.2 కోట్ల విలువైన తలనీలాలు మయన్మార్, థాయ్‌లాండ్ మీదుగా చైనాకు అక్రమంగా తరలిస్తుండగా అస్సాం రైఫిల్స్ పట్టుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా హిందూ మతంపై దాడి చేయడమే వారి ఏకైక ఎజెండా. పరకామణి కేసులో రవికుమార్ డబ్బు దోచేశాడు. వైసీపీ వారు సెటిల్‌మెంట్ చేశారు. రూ.40 వేల కోట్లు దోచేసిన వ్యక్తి, 25 ఏళ్లు మందుబాబుల డబ్బును తాకట్టు పెట్టిన వ్యక్తి. అవినీతికి ఆది పురుషుడు జగన్మోహన్ రెడ్డే. అవినీతి గురించి పుస్తకం రాయాలంటే ఆయనతో మొదలు పెట్టాలి. రాజకీయ అవినీతిపై PhD చేయాలంటే జగన్‌మోహన్ రెడ్డి మొదటి ర్యాంక్‌లో ఉంటాడు. ’’ అని బుచ్చి రాంప్రసాద్ దుయ్యబట్టారు. 

Tags:    

Similar News