YS Jagan: బొత్స అనూష ఆధ్వర్యంలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు

YS Jagan: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వానికి పేదల కష్టాలు పట్టడం లేదని, కుర్చీ యావే తప్ప ప్రజా సంక్షేమం పట్టించుకోవడంలేదని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.

Update: 2025-12-22 06:13 GMT

YS Jagan: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వానికి పేదల కష్టాలు పట్టడం లేదని, కుర్చీ యావే తప్ప ప్రజా సంక్షేమం పట్టించుకోవడంలేదని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. గరివిడిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన కుమార్తె, కుమారుడు బొత్స అనూష, బొత్స సందీప్ నేతృత్వంలో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు ఆయన హాజర య్యారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో సామాన్యులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబు విధానాలు ప్రైవేటీకరణదిశగా ఉన్నాయన్నారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యమవుతుంటే కూటమి భాగస్వామ్యంలో ఉన్న చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.

40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజలకు ఏం చేశారో చెప్పాలని మాజీ ఎంపీ, పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ ప్రశ్నించారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని కానీ ఒక్కసారి సీఎంగా పని చేసిన జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. కరోనా సమయంలో రెండేళ్లు ఓ వైపు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూనే జీఎస్టీను పెంచి రాష్ట్రాభివృద్ధిని చూపించరాన్నారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళా శాలలు ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అలాగే విజయనగరం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలతో పాటు ఎయిర్పోర్టు, గిరిజన యూనివర్సిటీ వంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు. చంద్రబాబు పరిపాలనలో డైవర్షన్ పాలిటిక్స్, రెడ్బుక్ రాజ్యాంగం తప్ప ఇంకేం ఉందన్నారు. విజయనగరం పార్లమెంటు పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, బొత్స అనూష, బొత్స సందీప్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్వి.రమణరాజు, చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల వైఎస్సార్సీపీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మీసాల వరహాలనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, మీసాల విశ్వేశ్వరరావు, బమ్మిడి కార్తీక్, శ్రీదేవి, పొట్నూరు సన్యాశినాయుడు, శీర అప్పలనాయుడు, స్వామి నాయుడు, కోట్ల వెంకటరావు, బూర్లె నరేష్, పీఎ స్ఆర్కే.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

బొత్స సందీప్‌ మాట్లాడుతూ

యువతకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదర్శప్రాయులు. ఆయన పుట్టినరోజు వేడుకల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. నిరుపేద కుటుంబాలను పలకరిస్తే మళ్లీ జగనన్నే సీఎం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

మళ్లీ జగనన్న సీఎం చేసుకుంటాం:బొత్స అనూష

బొత్స అనూష మాట్లాడుతూ

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఇంత ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉంది. రక్తదాన శిబిరానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మధ్యకు వెళ్లడం సంతోషాన్నిచ్చింది. మళ్లీ జగనన్న అధికారంలోకి వచ్చి, తమ జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రజలు భగవంతుడిని ప్రార్థిస్తున్నారని" పేర్కొన్నారు.

100 మంది రక్తదానం

మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా గరివిడిలోని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. వంది మంది అభిమానులు, కార్యకర్తలు, యువత హాజరై స్వచ్ఛందంగా రక్త దానం చేశారు.

Tags:    

Similar News