ISRO Chairman Narayanan: శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్.. LVM3పై కీలక ప్రకటన

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న ఇస్రో చైర్మన్ ఎల్లుండి భారత బాహుబలి రాకెట్ LVM3 ప్రయోగిస్తాం- ఇస్రో చైర్మన్

Update: 2025-12-22 05:45 GMT

ISRO Chairman Narayanan: శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్.. LVM3పై కీలక ప్రకటన

 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాకెట్ నమూనాలకు, ఇస్రో చైర్మన్ నారాయణన్ కు వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఎల్లుండి భారత బాహుబలి రాకెట్ LVM3 ద్వారా.. అమెరికాకు చెందిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని గగనతలంలోకి పంపనున్నామన్నారు. భారత గడ్డపై నుంచి ప్రయోగించనున్న అతి బరువైన ఉపగ్రహంగా రికార్డు సృష్టించనుందని తెలిపారు. ఈ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టడం ద్వారా 4G, 5G సేవలు మరింత బలోపేతమవుతాయన్నారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని శ్రీవారిని కోరుకున్నాని తెలిపారు. అలాగే 2027 లక్ష్యంగా సాగుతున్న గగన్‌యాన్ కార్యక్రమం అడ్వాన్స్‌డ్ దశలో ఉందని.. గగన్‌యాన్‌కు ముందు మూడు మానవరహిత ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ నారాయణ్ తెలిపారు. 

Tags:    

Similar News