జనం తలరాతలు మార్చే జగన్ పాలన :సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జనం తలరాతలు మార్చే గొప్ప పాలన అందించిన గొప్ప నాయకులు వైయస్ జగన్ అని వైయస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశంసించారు. అందుకే పార్టీ ఓడిపోయినా ఆయనకు ఏమాత్రం ప్రజాదరణ తగ్గలేదన్నారు.
తాడేపల్లి: ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జనం తలరాతలు మార్చే గొప్ప పాలన అందించిన గొప్ప నాయకులు వైయస్ జగన్ అని వైయస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశంసించారు. అందుకే పార్టీ ఓడిపోయినా ఆయనకు ఏమాత్రం ప్రజాదరణ తగ్గలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి సజ్జల రామకృష్ణారెడ్డి పూలమాలలు వేసిన నివాళులర్పించారు. అనంతరం వేడుకలను ప్రారంభించారు. పార్టీ నాయకులతో కలిసి భారీ కేకును కట్ చేశారు. అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. వేడుకల అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు.
ప్రతి కుటుంబం బాగుండాలని పాలన అందించారు
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, కోట్లాది మంది తెలుగుప్రజల ఆరాధ్య నాయకులు, జననేత వైయస్ జగన్ జన్మదిన వేడుకలు పార్టీకి పండగ రోజుని అన్నారు. ‘‘కార్యకర్తలు కాలర్ ఎగరేసి చెప్పుకునే గొప్ప లక్షణాలున్న నాయకుడాయన. ఆయన వందేళ్లపాటు ఆయురారోగ్యాలతో రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకు సేవ చేసే భాగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. తమ పాలన ద్వారా జనం తలరాతలు మార్చే పాలన అందించిన గొప్ప నాయకుల్లో దివంగత్ వైయస్సార్, తర్వాత వైస్ జగన్ గుర్తుకొస్తారు. కూటమి ఏడాదిన్నర పాలన చూసిన తర్వాత తాము ఏం కోల్పోయామో రాష్ట్ర ప్రజలు గుర్తించారు. ఐదు దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్దిని ఐదేళ్లలో చేసి చూపించారు కాబట్టే పార్టీ ఓడిపోయినా ఆయనకు ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు. తన పాలనలో నిస్వార్థంగా సేవలందించిన ఫలితమే ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.’’ అని సజ్జల చెప్పారు.