Penukonda: రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షం: మంత్రి శంకర్ నారాయణ

అనంతపురం జిల్లా పెనుకొండలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

Update: 2020-03-15 14:00 GMT
Minister Shankar Rao

పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల వాయిదా పడ్డ విషయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల వాయిదా పడ్డానికి కారణం చంద్రబాబు అని ఆయన ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు పలువిధాలుగా అడ్డుకుంటున్నారని అందుకు ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ కూడా ఇందుకు తోడయ్యారు అన్నారు. కరోనా వైరస్ తో ఎన్నికల్లో వాయిదా పడడం ఎంత వరకు సమంజసమని ఇక నాలుగు రోజులు ఉంటే ఎన్నికలు పూర్తిగా సజావుగా సాగేవి అన్నారు.

కరోనా వలన ఎన్నికల వాయిదా పడ్డం, రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం నుండి వచ్చే నిధులు కూడా వెనక్కి వెళ్తాయని కూడా కమిషనర్ కి అటు ప్రతిపక్ష నేత చంద్రబాబుకి సంతోషంగా ఉన్నట్లు వుందని ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు.. అసలు ఎలక్షన్ కమిషనర్ ఎన్నికలు వాయిదా వేయాలని అంటే రాష్ట్ర ముఖ్య నేతలతో కానీ పార్టీ నేతలతో కానీ చర్చించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలక్షన్లను వాయిదా వేయాలని అది కూడా తెలియని ఎలక్షన్ అధికారి తన సొంత నిర్ణయంతో ఎన్నికలను వాయిదా వేయడం సరికాదన్నారు.


Tags:    

Similar News