Srisailam: శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.5,11,94,935
Srisailam: సీసీ కెమెరాల మధ్య హుండీ లెక్కించిన ఆలయ అధికారులు
Srisailam: మహాశివరాత్రి సందర్భంగా హుండీ లెక్కించిన అధికారులు
Srisailam: శ్రీశైలంలో జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీ లెక్కింపు నిర్వహించారు.. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో సీసీ కెమెరాల మధ్య పకడ్బందీగా నిర్వహించారు. ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 5 కోట్ల 11 లక్షల 94 వేల 935 రూపాయలు వచ్చిందని ఈఓ లవన్న తెలిపారు. 13 రోజుల్లో శ్రీ స్వామి అమ్మ వార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించారని వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 100 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారం లభించింది. వెండి 6 కిలోల 500 గ్రాములు లభించిందని ఈఓ తెలిపారు. వాటితోపాటు పలు విదేశీ కరెన్సీ కూడా వచ్చిందని తెలిపారు. పటిష్టమైన నిఘానేత్రాల మధ్య దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగిందని, దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివ సేవకులు పాల్గొన్నారని ఈవో తెలిపారు.