అవంతిలో మేధోసంపత్తి హక్కులపై జాతీయ సదస్సు

తగరపువలస దగ్గరలో ఉన్న అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో మేధోసంపత్తి హక్కుల పై జాతీయ సదస్సు ను సూక్ష్మ, చిన్న, మద్య తర‌హా పరిశ్రమల అభివృద్ది సంస్థ జాయింట్ డైరెక్టర్ టి.హెచ్ బైట్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

Update: 2020-03-04 11:05 GMT

భీమునిపట్నం: తగరపువలస దగ్గరలో ఉన్న అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో మేధోసంపత్తి హక్కుల పై జాతీయ సదస్సు ను సూక్ష్మ, చిన్న, మద్య తర‌హా పరిశ్రమల అభివృద్ది సంస్థ జాయింట్ డైరెక్టర్ టి.హెచ్ బైట్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఎన్.ఆర్.డి.సి సైంటిస్టులు డా.సి.భవ్యా మీనన్, రస్మిత లు పాల్గొని మేధో సంపత్తి విలువలపై, పేటెంట్ హక్కులపై విద్యార్థులకు పూర్తిగా అవగాహన కల్పించారు.

ఇంజనీరింగ్ విద్యార్థులు యొక్క పరిశోధన నమూనాలను, నూతన ఆవిష్కరణలను అందులో ఎన్.ఆర్.డి.సి పాత్రను విద్యార్థులకు తెలిపారు. ఎం.ఎస్.ఎం.ఇ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, అప్పికొండ మాట్లాడుతూ... విద్యార్థులు వారి యొక్క వినూత్న సృజనాత్మకత ఆలోచనలను ఆచరణలో పెట్టి ఎన్.ఆర్.డి.సి, ఎం.ఎస్.ఎం.ఇ ల వలన పేటెంట్స్ పొందడం ద్వారా విలువ, భద్రత పెరిగి వ్యాపారం సులభత‌మవుతుందని చెప్పారు.

అవంతి కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్.ఎన్.వి గణేష్ మాట్లాడుతూ... ఈ జాతీయ సదస్సును జాతీయ పరిశోధనాభివృద్ది సంస్థ, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలాభివృద్ది సంస్థల సహకారంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


Tags:    

Similar News