రాజమండ్రి చేరుకున్న నారా లోకేష్.. చంద్రబాబుతో ములాఖత్..
Nara Lokesh: మ.3గంటలకు చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్
రాజమండ్రి చేరుకున్న నారా లోకేష్.. చంద్రబాబుతో ములాఖత్..
Nara Lokesh: టీడీపీ నేత నారాలోకేష్ రాజమండ్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం భువనేశ్వరి, బ్రాహ్మణి అక్కడే ఉన్నారు. సాయంత్రం మూడు గంటలకు చంద్రబాబుతో కుటుంబసభ్యులు ములాఖాత్ కానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో టీడీపీ అగ్ర నేతలతో లోకేష్ భేటీ కానున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోనే జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉండగా..సాయంత్రం ఆయనతో నారా లోకేష్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో రాజకీయ కార్యాచరణపై జనసేన నాయకులతో భేటీ అవుతారని సమాచారం.