Nadendla Manohar: డెబిట్ కార్డ్ సైజులో స్మార్ట్ రేషన్ కార్డులు.. ఉచిత పంపిణీకి డేట్స్ ఫిక్స్!
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సౌకర్యవంతంగా సేవలు అందించాలన్న ఉద్దేశంతో స్మార్ట్ రైస్ కార్డులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు తెలిపారు.
Nadendla Manohar: డెబిట్ కార్డ్ సైజులో స్మార్ట్ రేషన్ కార్డులు.. ఉచిత పంపిణీకి డేట్స్ ఫిక్స్!
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సౌకర్యవంతంగా సేవలు అందించాలన్న ఉద్దేశంతో స్మార్ట్ రైస్ కార్డులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు తెలిపారు. ఇవి డెబిట్ కార్డ్ సైజులో ఉండబోతున్నాయని, ఎటువంటి నేతల ఫొటోలు లేకుండా యజమాని ఫొటో మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.
ఇవి ముఖ్యాంశాలు:
కేంద్రం 60% రైస్ కార్డులకు నిధులు అందిస్తోంది.
16 లక్షల అప్లికేషన్లు వచ్చాయి; వీటిలో 9 లక్షల మందికి కొత్త కార్డులు మంజూరు.
ప్రస్తుతం రాష్ట్రంలో కోటి 45 లక్షల 97 వేలకుపైగా కార్డులు ఉన్నాయి.
4 కోట్లకు పైగా సభ్యులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.
కార్డులు క్యూఆర్ కోడ్ ఆధారంగా అనుసంధానమవుతాయి.
ఆగస్ట్ 25 నుంచి 31 వరకు ఉచితంగా కార్డులు పంపిణీ చేస్తారు.
65 ఏళ్లకు పైబడిన వృద్ధులకు హోమ్ డెలివరీ సదుపాయం.
ఇంకా తెలిపినవి:
మరికొన్ని జిల్లాల్లో సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించేందుకు స్థానికంగా అధికారులతో సమన్వయం చేసుకుంటామని అన్నారు. దీపం పథకం గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు 93 లక్షల మందికి పైగా లబ్ధి పొందినట్టు పేర్కొన్నారు. దీపం 2 పథకానికి జూలై 31 వరకు అవకాశం ఉందని తెలిపారు. డిజిటల్ వేలెట్ పై పైలట్ ప్రాజెక్ట్‌గా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో దీపం 2 అమలు జరుగుతుందని వివరించారు.