Simhachalam Temple: వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన సింహాచలం

Simhachalam Temple: మహిమాన్విత ముక్కోటి ఏకాదశి రోజు మహావిష్ణువుని ఉత్తరద్వారం లో దర్శించుకోవడం అద్భుతం.. అనిర్వచనీయం.

Update: 2025-12-29 11:30 GMT

Simhachalam Temple: మహిమాన్విత ముక్కోటి ఏకాదశి రోజు మహావిష్ణువుని ఉత్తరద్వారం లో దర్శించుకోవడం అద్భుతం.. అనిర్వచనీయం. స్వామి యోగ నిద్ర నుండి మేల్కొని మూడు కోట్ల మంది దేవతలకి దర్శనం ఇచ్చిన అత్యంత పవిత్రమైన, పుణ్యమైన రోజు కాబట్టి ఆ రోజు స్వామి దర్శనం ఎంతో మహిమాన్వితం. విశాఖ సింహాచల క్షేత్రం అల వైకుంఠపురాన్ని తలపిస్తోంది. ముక్కోటికి సింహాచలం ఎంతో శాస్త్రోక్తంగా ముస్తాబవుతోంది.

వైకుంఠ ఏకాదశి నే ముక్కోటి ఏకాదశి, మోక్షదా ఏకాదశి అని కూడా పిలుస్తారు. హిందువులు అత్యంత విశేషమైన రోజుగా భావిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు మహా విష్ణువు యోగ నిద్ర కి వెళ్తారు. శయనిస్తాడు కాబటి శయన ఏకాదశి గా పిలుస్తారు. అప్పటి నుండి నాలుగు నెలల పాటు స్వామి యోగ నిద్ర లో ఉంటారు. అయితే కార్తీక ఏకాదశి రోజు స్వామి మెల్కొన్నప్పటికీ.. మార్గశిర ఏకాదశి రోజు దేవతలకి భక్తులకు దర్శనం ఇస్తారు.. అందుకే ఆరోజున వైకుంఠ ద్వారాలు తెరిచిన రోజు కాబట్టి వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. ఆ రోజు మూడు కోట్ల మంది దేవతలు స్వామిని దర్శించుకున్నాక గరుడ వాహనంపై దేవతలతో కలిసి స్వామి భూమండలం లో భక్తులకి దర్శనం ఇచ్చినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యుడు ఉత్తరాయణం లోకి ప్రవేశించే ముందు వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. అందుకే ఈ రోజు స్వామి దర్శనం అత్యంత మహిమాన్వితం అంటారు.

వైకుంఠ ఏకాదశి కోసం సింహాచల క్షేత్రం సిద్ధమవుతోంది. ఉత్తర ద్వారా దర్శనాలు కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 5:30 నిముషాల నుండి 11 గంటల వరకు ఉత్తర ద్వారం లో భక్తులకు స్వామి దర్శనం ఇవ్వనున్నారు. ఇందుకోసం వచ్చే భక్తులకు దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 50 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. వీవీఐపీ ల కి ప్రత్యేక నిర్ణీత సమయం కూడా కేటాయిస్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్ లో దర్శన టికెట్ల విక్రయం పూర్తి చేశారు.

ఉత్తరద్వారంలో, వైకుంఠ ఏకాదశి రోజు సంపెంగళ సువాసనల మధ్య చందన రూపుడు అప్పన స్వామి స్వామిని దర్శించి తరించేందుకు భక్తులు సింహగిరి కి పయనం అవుతున్నారు. ఆ నరసింహ స్వామి ఆశీస్సులు తో అందరికి అందాలని ఆశిద్దాం.

Tags:    

Similar News