Venkateswara Rao: టికెట్ ఇవ్వమని తేల్చిచెప్పారంటూ భావోద్వేగం.. నేను ఈ పరిణామం ఊహించలేదు
Venkateswara Rao: నాకు గ్రాఫ్ లేదని చెప్తే మళ్లీ టికెట్ గురించి మాట్లాడను
Venkateswararao: టికెట్ ఇవ్వమని తేల్చిచెప్పారంటూ భావోద్వేగం.. నేను ఈ పరిణామం ఊహించలేదు
Venkateswararao: నూజివీడు టీడీపీ ఇన్‌ఛార్జ్ భావోద్వేగానికి గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ లేదని అధిష్టానం తేల్చేయడంతో.. కంటతడి పెట్టారు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు. శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించిన ముద్దరబోయిన.. నూజివీడులో ఇటీవల పరిణామాలు ఇబ్బందికరంగా మారాయన్నారు. తనను ఇబ్బంది పెట్టినా పార్టీ కోసం కష్టపడ్డానని తెలిపారు. అనివార్య కారణాలతో టికెట్ ఇవ్వలేమని చంద్రబాబు తనకు చెప్పారన్న ముద్దరబోయిన.. పదేళ్లు పనిచేసిన తనను పక్కన పెట్టి నిన్న మొన్న వచ్చిన వారికి టికెట్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.