Kesineni Sivanath: జగన్ అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్.. అమరావతిపై ఎంపీ కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు!

Kesineni Sivanath: మాజీ ముఖ్యమంత్రి జగన్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్.

Update: 2026-01-09 10:07 GMT

Kesineni Sivanath: మాజీ ముఖ్యమంత్రి జగన్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. అమరావతిపై జగన్ రోజుకో మాట మాట్లాడుతున్నాడన్నారు ఎంపీ కేశినేని చిన్ని. రాయసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 925 కోట్లు ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిన ఘనత జగన్‌దే అన్నారు. చివరకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వైసీపీ అటకెక్కించిందన్నారు ఎంపీ కేశినేని చిన్ని. భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మించిన ఘతన మా కూటమి ప్రభుత్వానిది అన్నారు. మరో 25 ఏళ్లు కూటమి అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు ఎంపీ కేశినేని చిన్ని.

Tags:    

Similar News