Mohan Babu University: మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా.. గుర్తింపు రద్దుకు సిఫార్సు!

Mohan Babu University: తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత విద్యాకమిషన్ భారీ షాకిచ్చింది.

Update: 2025-10-08 05:49 GMT

Mohan Babu University: తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత విద్యాకమిషన్ భారీ షాకిచ్చింది. మోహన్‌బాబు యూనివర్సిటికి భారీ జరిమానా విధించింది. దీనితో పాటు వర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. మూడేళ్లుగా ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి 26 కోట్ల అదనంగా వసూలు చేశారని ఆరోపణల నేపథ్యంలో ఉన్నతవిద్యా కమిషన్ విచారణ చేపట్టింది.

విచారణ అనంతరం విద్యార్థుల నుంచి నిర్ధేశిత ఫీజుల కంటే... అధికంగా వసూలు చేసినందుకు గానూ.. 15 లక్షల జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయాలను 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News