RK Roja: టీడీపీ అధికారంలోకి రావడం పగటి కలే.. 2024లో జగనన్న వన్స్ మోర్ అని...
RK Roja: టీడీపీ నేతలపై మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు.
RK Roja: టీడీపీ అధికారంలోకి రావడం పగటి కలే.. 2024లో జగనన్న వన్స్ మోర్ అని...
RK Roja: టీడీపీ నేతలపై మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. 2019 నుండి ఎక్కడా గెలవకపోడంతో టీడీపీ నాయకులు పిచ్చెక్కిపోయారన్నారు. టీడీపీకి అనుకోకుండా మూడు ఎమ్మెల్సీలు వచ్చాయన్నారు. టీడీపీ నేతలు అహంకారంతో అసెంబ్లీ స్పీకర్‌ను అవమానించి దాడి చేయడం దురదృష్టకరమన్నారు. టీడీపీ అధికారంలోకి రావడం పగటి కలే అని అన్నారు. 2024లో జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు అంటున్నారని చెప్పారు.
టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని సూచించారు రోజా. జీవో నంబర్-1 కోసం తీర్మానం ఇచ్చిన టీడీపీ ఎప్పుడైనా ప్రజా సమస్యల కోసం వాయిదా తీర్మానం ఇచ్చారా?. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో 11 మందిని చంపేస్తే ప్రజా రక్షణ బాధ్యతతో జీవో నంబర్-1 తీసుకొచ్చాం. జీవో నంబర్-1 ప్రజలకు రక్షణ కల్పించడానికే అని అన్నారు. టీడీపీ అధికారంలోకి రావడం పగటి కలే. టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అని చురకలు అంటించారు.