మాజీ సీఎం జగన్‌కు మంత్రి రాంప్రసాద్ సవాల్
అన్నమయ్య జిల్లా టీడీపీ కార్యాలయంలో సమావేశం మాజీ సీఎం జగన్‌కి మంత్రి రాంప్రసాద్ సవాల్ అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యలపై చర్చిద్దాం -రాంప్రసాద్
మాజీ సీఎం జగన్‌కు మంత్రి రాంప్రసాద్ సవాల్
మాజీ సీఎం జగన్‌కి మంత్రి రాంప్రసాద్ సవాల్ విసిరారు. 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్తే.. ప్రజా సమస్యలపై చర్చలు జరుపుదామన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి రాంప్రసాద్ పాల్గొన్నారు. ప్రతిపక్ష హోదాలో కూడా లేని జగన్ కూటమిపై ట్వీట్స్ చేయడం తగదన్నారు. జగన్ పెట్టే ట్వీట్‌ల వలన తమకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు ప్రతినిత్యం తోడుగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఏ సమస్య ఉన్న కేంద్రంతో చర్చించి పరిష్కరించే ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని పేర్కొన్నారు.