ఉల్లి సమస్య త్వరలోనే ఒక కొలిక్కి వస్తుంది

ఎక్కువ ధరలకు ఉల్లిని కొనుగోలు చేసి వినియోగదారుడికి తక్కువ ధరకు ఏపీలోనే ఇస్తున్నామన్నారు.

Update: 2019-12-05 16:15 GMT
Mopidevi Venkataramana

ఉల్లి ధరలు చుక్కలనంటాయి. కిలో ఉల్లిపాయలు 150రూపాయల వరకూ ఉంది. దీంతో జనం ఉల్లిపాయలు కొనడానికే బయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఉల్లిధరలను రాయితీపై ఇస్తుంది. కిలో ఉల్లిని రూ.35కే రైతుబజారులో విక్రయిస్తుంది. దీంతో జనం ఉల్లిపాయల కోసం గంటల తరబడి క్యూలైన్లో నిల్చుంటున్నారు. కొన్ని చోట్ల ఉల్లి గడ్డలు సరఫర తక్కువగా ఉండడం త్వరగా అయిపోవడంతో జనం గగ్గోలుపెడుతున్నారు.తాజాగా దీనిపై ఏపీ మంత్రి మోసిదేవి వెంకటరమణ స్పందించారు. ఉల్లి సమస్యలు ఓ కొలిక్కి వస్తాయని, ధరల పెరుదల నుంచి సామాన్యూడిని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగా తక్కువ ధరకు ఉల్లిపాయలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కువ ధరలకు ఉల్లిని కొనుగోలు చేసి వినియోగదారుడికి తక్కువ ధరకు ఏపీలోనే ఇస్తున్నామన్నారు.

టర్కీ, ఈజిప్టు దేశాల నుంచి ఉల్లిని కేంద్ర ప్రభుత్వం దిగుమతికి ఆదేశించిందని, అవి 14,15తేదీలోగా అందుబాటులోకి వస్తాయని తెలిపింది. కేంద్రం పెద్ద ఎత్తున ఉల్లి దిగుమతి చేసుకుంటుదన్నారు. ఏపీకి 22, మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇవ్వడానికి ఒప్పుకుంది. రోజుకు 200 మెట్రిక్ టన్నుల ఉల్లి కొనుగొలు చేస్తున్నామని మంత్రి మోపిదేవి చెప్పారు. కొందరూ వ్యాపారులు కావాలనే కృత్రిమంగా ఉల్లి కొరత సృష్టిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags:    

Similar News