Merugu Nagarjuna: అలాంటి నీచ సంస్కృతి చంద్రబాబుకు అలవాటే..
Merugu Nagarjuna: చంద్రబాబు తనపై తానే రాళ్ళేసుకుని రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండి పడ్డారు ఏపీ మంత్రి మేరుగ నాగార్జున.
Merugu Nagarjuna: అలాంటి నీచ సంస్కృతి చంద్రబాబుకు అలవాటే..
Merugu Nagarjuna: చంద్రబాబు తనపై తానే రాళ్ళేసుకుని రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండి పడ్డారు ఏపీ మంత్రి మేరుగ నాగార్జున. టీడీపీ నేతల ఆరోపణలపై స్పందించిన ఆయన చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని అందుకే ఇలాంటి నాటకాలాడుతున్నారని విమర్శించారు. రాళ్లు, చెప్పులు వేయించే సంస్కృతి చంద్రబాబుకుందన్న మంత్రి.. అలాంటి నీచ సంస్కృతి వైయస్ జగన్‌కు లేదన్నారు. తన వాళ్ళతో రాళ్ళేయించుకుని జనంలో సెంటిమెంట్ రగిల్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌పై రెక్కీ నిర్వహించింది చంద్రబాబు కుమారుడి స్నేహితులేనని గుర్తు చేశారు.