మహానాడులో జూమ్ యాప్ లోకి మమ్మల్ని తీసుకోవాలి.. చంద్రబాబుతో చర్చకు సిద్దం బొత్స సవాల్

చంద్రబాబు అధికారంలోకి రాక ముందు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడుతారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

Update: 2020-05-23 13:17 GMT
Minister Botsa Satyanarayana (File photo)

చంద్రబాబు అధికారంలోకి రాక ముందు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడుతారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న లేక పోయినా మాట మీద నిలబడే వ్యక్తి అని అన్నారు. 2019 మే 23 తేదీ సువర్ణ అక్షరాలుతో లిఖిచదగ్గ తేదీని,రాజశేఖర్ రెడ్డికి మించిన తనయుడిగా జగన్ మోహన్ రెడ్డి ని ప్రజలు ఎన్నుకున్నారని చెప్పారు.

రెండు పేజీల్లో మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి పెట్టారని,ఏడాది కాలంలో దాదాపు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలు సీఎం జగన్ అమలు చేశారని చెప్పుకొచ్చారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పే హామీలు సాధ్యం కాదని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారని వాటిని అమలు చేసి చూపిస్తున్నరని చెప్పారు. వైఎస్ ఆశయాలను జగన్మోహన్ రెడ్డి నెరవేర్చుతున్నారని కొనియాడారు. రాయలసీమ కరువుకు చర్యలు తీసుకుంటున్నారని, దేశంలో ఏ రాష్ట్రాల్లో అమలు కానన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి పాలనల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని కరోనా టెస్టులు ఏపీలో జరుగుతున్నాయని బొత్స అన్నారు. పక్క రాష్ట్రాల్లో 500కి మించి కరోనా టెస్ట్ లు జరగలేదని అన్నారు. ప్రతిపక్ష నేతలు అసభ్య పదజాలంతో సీఎంపై విమర్శలు చేస్తున్నారు. న్యాయ స్థానాలకు వెళ్లి టీడీపీ ప్రజా సంక్షేమాన్ని అడ్డుకుందని ఆరోపించారు. టీడీపీ వైఖరిని ప్రజలు గమనించాలి.. కుట్రలు కుతంత్రాలు తో టీడీపీ కోర్టు లకు వెళ్తుందిని ధ్వజమెత్తారు.

పేద వాడికి న్యాయం జగలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యంమని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలం, పక్క ఇల్లు ఉండాలనేది సీఎం జగన్ లక్ష్యమని , రైతులు కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు పెట్టిన బకాయిలను జగన్మోహన్ రెడ్డి తీర్చుతున్నారని, ప్రభుత్వం ఎక్కడ వైపల్యం చెందిడిందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

మహానాడులో ప్రభుత్వం వైఫల్యాలను చర్చ చేసే సమయంలో మమ్మల్ని కూడా జూమ్ లోకి తీసుకోవాలి...చంద్రబాబుతో బహిరంగంగా జూమ్ యాప్ లో చర్చ చేసేందుకు మేము సిద్ధమని బొత్స సవాల్ విసిరారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి అమలు చేయడం తప్పాఅని నిలదీశారు. ప్రభుత్వం ఎక్కడ వైపల్యం చెందిడిందో చెప్పాలన్నారు. మూడు లాంతర్ల స్తూపం చారిత్రాత్మక స్తూపం కాదు..మూడు లాంతర్ల అనేది సిమెంట్ కట్టడం.మూడు లాంతర్ల సెంటర్ లో వర్క్ జరుగుతుంది.. మూడు లాంతర్ల కట్టడాన్ని తీసేయడం లేదని వివరించారు.

Tags:    

Similar News