50 ఏళ్లయినా నిండకుండానే నిండు నూరేళ్లు.. "యూ గ్రో-వీ గ్రో" అంటూ దుబాయి నుంచి..

Mekapati Goutham Reddy: యూ గ్రో, వీ గ్రో అనే కొత్త నినాదంతో.. అందరం ఎదుగుదాం.. మా ఆంధ్రాకు రండి పెట్టుబడులు పెట్టండి..

Update: 2022-02-21 15:45 GMT

50 ఏళ్లయినా నిండకుండానే నిండు నూరేళ్లు.. "యూ గ్రో-వీ గ్రో" అంటూ దుబాయి నుంచి..

Mekapati Goutham Reddy: యూ గ్రో, వీ గ్రో అనే కొత్త నినాదంతో.. అందరం ఎదుగుదాం.. మా ఆంధ్రాకు రండి పెట్టుబడులు పెట్టండి అంటూ దుబాయికి వెళ్లొచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన మేకపాటి గౌతంరెడ్డి రాజకీయాల్లోనూ రాణించారు. అందరి మన్ననలూ అందుకొన్నారు. ఆత్మీయుడై మెలిగారు. అంతలోనే హఠాత్తుగా అదృశ్యమైపోయారు.

మిత భాషి, మృదు స్వభావి అయిన మేకపాటి గౌతంరెడ్డి.. ఉదయం జిమ్ కు వెళ్లేందుకు రెడీ అయి, బయటకు వెళ్లేక్రమంలో ఛాతీలో నొప్పి అంటూ సోఫాలో కూలబడిపోయారు. కుటుంబ సభ్యులు, ఇంట్లో ఉండే పనివారు వెంటనే అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి తీవ్రతను గుర్తించి ట్రీట్మెంట్ వెంటనే మొదలుపెట్టినా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కుడిభుజం లాంటి అత్యంత నమ్మకస్తుడైన గౌతం రెడ్డి ఇక శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. 50 ఏళ్లు కూడా పూర్తిగా నిండకుండానే గౌతంరెడ్డి కాలం చేయడంతో కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు, వైసీపీ సీనియర్లు శోకసంద్రంలో మునిగిపోయారు.

రాజకీయాల్లోకి రాకముందు గౌతంరెడ్డి పారిశ్రామికవేత్తగా ఉన్నారు. అయితే ఆయన కుటుంబం మొదట్నుంచీ రాజకీయాల్లోనే కొనసాగుతోంది. అందువల్ల ఆయన రాజకీయాల్లో సులభంగా రాణించారు. 1971లో పుట్టిన గౌతమ్ బ్రిటన్‌లో ఎమ్మెస్సీ చదివారు. 2014, 2019లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి గెలుపొందారు. ఆయనలోని సిన్సియారిటీని, కమిట్ మెంట్ ను గుర్తించిన జగన్ మంత్రి పదవి కట్టబెట్టారు. 2019 జూన్‌ 8న మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు గౌతమ్. ఈ క్రమంలోనే ఏపీలో పెట్టుబడులు పెట్టి అందరం ఎదుగుదామంటూ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిస్తూ.. "యూ గ్రో - వీ గ్రో" అంటూ దుబాయి పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొచ్చారు. దుబాయి మీట్ లో కొన్ని ప్రాజెక్టులు కూడా కన్ఫామ్ అయ్యాయని చెబుతున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా జగన్ సర్కారు రెండు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. అమరావతిలోని శాసనసభ వద్ద జాతీయజెండాను అవనతం చేశారు. 

Tags:    

Similar News