Visakhapatnam: 7వ తేదీన కంచరపాలెంలో మెగా జాబ్‌మేళా

జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ఈ నెల 7న ఉదయం పది గంటలకు మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారులు కె.సుధ, సి.హెచ్‌.సుబ్బిరెడ్డిలు సంయుక్తంగా తెలిపారు.

Update: 2020-03-05 06:57 GMT

కంచరపాలెం: జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ఈ నెల 7న ఉదయం పది గంటలకు మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారులు కె.సుధ, సి.హెచ్‌.సుబ్బిరెడ్డిలు సంయుక్తంగా తెలిపారు. పదమూడు కంపెనీల్లో 1801 ఉద్యోగాలు భర్తీ కానున్నాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావచ్చన్నారు.

అయిదో తరగతి పైబడిన నుంచి పది, ఇంటర్‌, ఐటిఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్‌, ఎంబీఏ, బీటెక్‌ (కెమికల్‌), ఎంఎస్సీ ఆర్గానిక్‌, అనాటికల్‌ కెమిస్ట్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ, ఎం.ఎ.ఇంగ్లీషు లిట్‌ తదితర అర్హతలు కలిగిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాలకు జిల్లా ఉపాధికల్పనా కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు.


Tags:    

Similar News