మరోసారి మావోయిస్టుల అలజడి.. చెట్లను నరికి..

Update: 2019-09-21 07:23 GMT

ఏజన్సీలో మరోసారి మావోయిస్టులు అలజడి సృష్టించారు. మావోయిస్టు 15వ వార్షికోత్సవాల సందర్భంగా విలీన మండలాల్లో రాత్రిపూట చెట్లను నరికి రోడ్డుకు అడ్డంగా వేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఛత్తీస్ ఘఢ్ నుండి హైదరాబాద్ వెళ్ళే ప్రయాణికులు రోడ్లపై రాత్రంతా పడిగాపులు కాశారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈనెల 28 వరకు ఆంధ్రా-ఛత్తీస్ ఘఢ్ ఘాట్ రోడ్ వైపు వెళ్లే రాత్రీ పూట బస్సు సర్వీసులను నిలిపివేశారు. అలాగే గోకవరం, ఏలేశ్వరం, కాకినాడ, రాజమహేంద్రవరం, భద్రాచలం తదితర డిపోల పరిధిలో.. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో నైట్ హాల్ట్ సర్వీసులు రద్దు చేశారు. చింతూరు, రంపచోడవరం ఏజెన్సీల లో హై అలెర్ట్ ప్రకటించారు.

Tags:    

Similar News