Malladi Vishnu: బాబు, సోమువీర్రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం..
Malladi Vishnu: ఏపీలో గణేష్ మండపాల విషయంలో బీజేపీ, టీడీపీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.
Malladi Vishnu: బాబు, సోమువీర్రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం..
Malladi Vishnu: ఏపీలో గణేష్ మండపాల విషయంలో బీజేపీ, టీడీపీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. బాబు, సోము వీర్రాజుకు పనీపాట లేక దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారన్నారు. 2014 నుంచి బాబు హాయంలో ఇచ్చిన మార్గదర్శకాలు మాత్రమే తాము అమలు చేస్తున్నామన్నారు. నీచ రాజకీయాలుచేస్తున్న ఇలాంటి వారిపై పోలీసులకు పిర్యాదు చేస్తామన్నారు. ఇకపై ప్రభుత్వం బురదజల్లే కుట్రలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సోము వీర్రాజుకు దమ్ముంటే పోలవరానికి నిధులు ఇప్పించాలన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని కోరారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు.