Lockdown in Telangana: లాక్ డౌన్ భయంతో ఏపీకి క్యూ కట్టిన జనం!

Lockdown in Telangana: తెలంగాణాలో మరోమారు లాక్ డౌన్ ఉంటుందనే ప్రచారం ఊపందుకోవడంతో ఏపీ వాసులు తమ స్వంత గ్రామాలకు సిద్ధమవుతున్నారు.

Update: 2020-07-01 02:00 GMT

Lockdown in Telangana: తెలంగాణాలో మరోమారు లాక్ డౌన్ ఉంటుందనే ప్రచారం ఊపందుకోవడంతో ఏపీ వాసులు తమ స్వంత గ్రామాలకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా మంగళవారం రాత్రి విజయవాడ హైవేపై వాహనాలన్నీ బారులు తీరాయి. నిబంధనలకు అనుగుణంగా ఏపీలోకి అనుమతిస్తామని చెప్పడంతో కొన్ని సమయాల్లో గందరగోళం నెలకొంది.

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో మరో15 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించే విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రలోకి వాహనాలు బారులు తీరాయి. ఈ సారి మరింత కఠినంగా లాక్‌డౌన్ ఉండే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో సొంత గ్రామాలకు ఆంధ్రవాసులు క్యూ కట్టారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక ఆంధ్రలోని సాయంత్రం 7గంటల వరకే వాహనాలకు అనుమతి ఉండటంతో.. అధికారులు వాహనాలను నిలిపివేస్తున్నారు.

అలాగే రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటలవరకు కర్ఫ్యూ ఉండటంతో వాహనాలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో వాహనదారులను సరిహద్దుల్లో ఆపేస్తుండగా.. అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతిని ఇస్తున్నారు. కాగా హైదరాబాద్‌ లాక్‌డౌన్‌పై మరో రెండు, మూడు రోజుల్లో కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో రేపటి నుంచి జరగాల్సిన ఎంసెట్, పాలిసెట్, ఐసెట్ , ఈ సెట్, లాసెట్, పీజీ ఎల్ సెట్, ఎడ్‌సెట్, పీఈ సెట్ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.


Tags:    

Similar News