పంది పిల్లను నోట కరిచి చిరుత హల్ చల్!
అడవుల్లో జంతువులన్నీ గ్రామాలపైనే పడుతున్నట్టు కనబడుతున్నాయి.
అడవుల్లో జంతువులన్నీ గ్రామాలపైనే పడుతున్నట్టు కనబడుతున్నాయి.ఒక చోట ఏనుగులు, మరో చోట చిరుత పులులు. వేరొక చోట లేడీ పిల్లలు. ఒకటేమిటి .. ప్రతి రోజూ ఎక్కడో చోట.. ఏదో ఒక జంతువు వచ్చి జనావాలపై పడి భీభత్సం చేస్తున్నాయి. అయితే వీటిలో లెక్కకు రానికి మరికొన్ని. తాజాగా చిరుత పంది పిల్లను నోట కరచుకుని చెట్టు ఎక్కి హల్ చల్ చేసింది.
కర్నూల్ జిల్లాలోని మహానంది దేవస్థానం సమీపంలో చిరుత పులి హల్ చల్ చేసింది. గోశాల సమీపంలో తిరుగుతున్న ఒక పంది పిల్లను చిరుత నోట కరుచుకొని చెట్టు ఎక్కింది. దీనితో పందులు అరవడంతో చిరుత పంది పిల్లను వదిలేసి చెట్టు మీద నుంచి దూకి పక్కనే ఉన్న అడవి వైపు వెళ్లి చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత చిరుత పులి పందుల గుంపుపై దాడి చేసి పంది పిల్లను నోట కరుచుకొని అడవిలోకి వెళ్లి పోయింది. ఈ దృశ్యాల్ని గోశాల వద్ద ఉన్న కాపలాదారు తిలకించి విషయాన్ని మహానంది దేవస్థానం అధికారులు, స్థానికులకు తెలియజేశారు. దీంతో దేవస్థానం అధికారులు వెంటనే చిరుతపులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత సంచారంతో మహానంది వాసులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.