సిఏఏ, ఎన్ ఆర్పిలకు వ్యతిరేకంగా వామపక్షాలు నిరసన

దేశవ్యాప్తంగా నేడు గణతంత్ర వేడుకలు జరుగుతుండగా సిపిఐ మండల కార్యదర్శి వెలుగుల అర్జనరావు ఆధ్వర్యాన పట్టణంలో వామపక్షాలు , ముస్లిం పెద్దలు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు.

Update: 2020-01-26 15:09 GMT

పాయకరావుపేట : దేశవ్యాప్తంగా నేడు గణతంత్ర వేడుకలు జరుగుతుండగా సిపిఐ మండల కార్యదర్శి వెలుగుల అర్జనరావు ఆధ్వర్యాన పట్టణంలో వామపక్షాలు , ముస్లిం పెద్దలు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. సిఏఏ, ఎన్ ఆర్సీ, ఎన్పీ ఆర్ లకు వ్యతిరేకంగా లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు లౌకిక వాదులు, ప్రజాతంత్ర వాదులు, విద్యావంతులు, కలిసి రావాలని పిలుపునిచ్చారు.

రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ,లక్ష్యాలకు మత సామరస్యానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. మతం ప్రాతిపదికన విభజన చేస్తే సహించమంటూ నినాదాలు చేశారు. మతం అనేది వ్యక్తిగత స్వేచ్చ అని , దానిని సిఏఏ , ఎన్సి ఆర్ లకు ముడిపెట్టరాదని తెలిపారు. రాజ్యాంగ స్పూర్తి కి భిన్నంగా మతప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు. జనాభా గణాంకాలుతో పాటు ఎన్పీఆర్ ను అమలు చేసి, తద్వారా ఎన్ ఆర్సీ అమలుచేయాలని కేంద్రం చూస్తోందని పేర్కొన్నారు.

కాబట్టి ఏపి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు జరిపి ఎన్ ఆర్సీ కి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్పీ ఆర్ ను రాష్ట్రంలో అమలుచేయబోమని ప్రభుత్వ ప్రకటించాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు శివప్రకాష్, గోళ్ల వెంకటేశ్వరరావు, చాపల శ్రీరామ్మూర్తి , ఈశ్వర్రావు, రాజాబాబు, సిపిఎం నాయకులు అప్పలరాజు, దాసు. ముస్లింలు పెద్దలు యం.ఆర్.షరీఫ్, యం.ఎస్.షరీఫ్, సాలార్ ఆలీ ,యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News