Nellore: నేతన్నలకు, రైతన్నలకు అండగా కూటమి ప్రభుత్వం
Nellore: నెల్లూరు రూరల్ కలివెలపాలెం పి.ఎ.సి.ఎస్. పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు.
Nellore: నేతన్నలకు, రైతన్నలకు అండగా కూటమి ప్రభుత్వం
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కలివెలపాలెం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
అన్నం పెట్టే రైతు బాగుండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఆకాంక్ష అన్నారు. రైతు ఎక్కడా నష్టపోకూడదు, ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
క్షేత్రస్థాయిలో రైతులకు ఏ ఇబ్బంది కలగకూడదని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులతో నేరుగా మాట్లాడాలనే, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి వచ్చామని తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా, రైతులకు అత్యంత గౌరవం ఇచ్చిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ మీద వారి పేరు ఉండేలా, ఎక్కడ పండించిందో తెలిసేలా ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ను ముద్రించి, రైతుల శ్రమను భావితరాలకు తెలిసేలా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఖరీఫ్ సీజన్ లో రాష్ట్రం మొత్తం మీద 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూటమి ప్రభుత్వం సేకరించిందని. ధాన్యం సేకరించడమే కాదు 24 గంటల్లో రైతు ఖాతాలకు ధాన్యం డబ్బులు జమ చేసి రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, టిడిపి మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, క్లస్టర్ ఇంచార్జ్ సారంగం గున్నయ్య, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇంచార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, కలివేలపాలెం పి.ఎ.సి.ఎస్. సొసైటీ చైర్మన్ చెన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, జెడ్పి కోఆప్షన్ మెంబర్ అలాబక్షు, టిడిపి నాయకులు వేడిచెర్ల వెంకటేశ్వర్ల యాదవ్, చెన్నారెడ్డి సురేందర్ రెడ్డి, యదనపర్తి శ్రీనివాసులు రెడ్డి,
జగదీష్ రెడ్డి, అత్తులూరు ఈశ్వరయ్య, పోతయ్య, హజరత్, శివప్రసాద్ నాయుడు, షామయ్య, శ్యాంసుందర్ రెడ్డి, దాసరి వెంకట శేషయ్య, వెంకటరామిరెడ్డి, మురళి రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, కిషోర్ నాయుడు, కామయ్య, జి. మల్లి, నాగులపాటి సురేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, వసంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాసులు యాదవ్, పెంచల రెడ్డి, చేవూరు రామిరెడ్డి, మురళి కృష్ణ, లేబూరు శంకరయ్య. కిషోర్ నాయుడు యాకసిరి అంజయ్య, కృష్ణయ్య, మధు బాబు, ఎన్. రామకృష్ణ, పి. కిరణ్, కాలేషా, చాంద్ బాషా, షూకూర్, తదితరులు పాల్గొన్నారు.