గ్యాస్ ధర పెంపునకు నిరసనగా వామపక్షాల ధర్నా

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయం పైన, పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలకు నిరసనగా వామపక్షాల ఆధ్యర్యంలో శనివారం స్థానిక శ్యామల సెంటర్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు.

Update: 2020-02-15 12:00 GMT

రాజమండ్రి: కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయం పైన, పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలకు నిరసనగా వామపక్షాల ఆధ్యర్యంలో శనివారం స్థానిక శ్యామల సెంటర్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. దీనిలో భాగంగా రాజమండ్రిలో సీపీఎం,సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

ఆయా పార్టీల జిల్లా కార్యదర్శులు టి.అరుణ్, టి.మధు, రమణ మాట్లాడుతూ.. రాష్టాన్ని ముక్కలు చేసి, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా తెలుగు ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు.

ఢిల్లీ ఎన్నికలు అయిన వెంటనే గ్యాస్ సిలిండర్ పై 149.50 రూపాయలు పెంచిందన్నారు. ప్రజల పై తీవ్ర భారం మోపిందన్నారు. వెంటనే బడ్జెట్ సవరించి ఏపీకి నిధులు కేటాయించాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో పోలిన వెంకటేశ్వరవు, నల్లా రామారావు, నాయకులు పాల్గొన్నారు.


Tags:    

Similar News