ఏపీకి రెండు టీఎంసీల నీటి విడుదలకు.. త్రిసభ్య కమిటీ ఓకే

ఏపీలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం మరో రెండు టీఎంసీలు నీరు కావాలని ఈ నెల 19, 20 తేదీల్లో కృష్ణాబోర్డుకు ఆంధ్రప్రదేశ్‌ రాసిన లేఖలో కోరింది.

Update: 2020-05-23 03:17 GMT

ఏపీలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం మరో రెండు టీఎంసీలు నీరు కావాలని ఈ నెల 19, 20 తేదీల్లో కృష్ణాబోర్డుకు ఆంధ్రప్రదేశ్‌ రాసిన లేఖలో కోరింది.అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మే నెల వరకు మాత్రమే పూర్తయినందున నీటి విడుదలను ఆపివేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల చెందినఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు నారాయణరెడ్డి, మురళీధర్‌తో పాటు బోర్డు సభ్య కార్యదర్శి కూడా హాజరయ్యారు. ఈ మేరకు 2 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు అంగీకరిస్తూ బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం ఉత్తర్వులు ఇచ్చారు.

కృష్ణాలో వరద జలాల వినియోగానికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నియమించిన కమిటీ నిర్ణయాలు వెలువడిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని ఈ సమావేశంలో భావించారు. వరదజలాల్లో ఏపీ 22 టీఎంసీల వరకు వినియోగించుకున్నట్లు బోర్డు లెక్కలు తీసిందని సమాచారం. అసలు వరద జలాలకు లెక్కలు ఏంటన్నది ఏపీ వాదన. సాగర్‌ కుడి కాలువ ఏపీ భూభాగంలో ఉందని, ఆ కాలువకు నీటి విడుదల అంశాన్ని తామే నిర్వహించుకుంటామని ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి ఈ సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం.

Tags:    

Similar News