Venigandla Ramu: ఒక్కో కుటుంబానికి రూ.50,000 ఆర్థిక సహాయం ఇస్తాం

Venigandla Ramu: కరోనా సమయంలో విధినిర్వహణలో ముగ్గురు కార్మికులు మరణించారు

Update: 2023-12-28 14:34 GMT

Venigandla Ramu: ఒక్కో కుటుంబానికి రూ.50,000 ఆర్థిక సహాయం ఇస్తాం

Venigandla Ramu: కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కాంటాక్ట్ పారిశుధ్య కార్మికుల సమ్మెకు సంఘీభావంగా గుడివాడ టీడీపీ ఇంచార్జి వెనిగండ్ల రాము పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు తెలుసుకుని.. చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారాయన.. కరోనా సమయంలో విధులు నిర్వహిస్తూ.. మరణించిన ముగ్గురు కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 వేల చొప్పున లక్షన్నర ఆర్థిక సహాయం ప్రకటించారు వెనిగండ్ల రాము... ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ బాధితుల లిస్టులో మున్సిపల్ కార్మికులు కూడా చేరారని, లక్షలాది మంది కార్మికులు అలమటిస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను మోసం చేసిన సీఎం జగన్... మరోసారి మడమ తిప్పాడని, కరోనా సమయంలో ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేసిన కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి దుర్మార్గపు పాలనలో ఇంకెంతమంది బలి కావలసి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల పోరాటాలకు టీడీపీ మద్దతుగా ఉంటుందన్నారు....టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని కార్మికు వర్గాల సమస్యలను ద్రబాబు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Tags:    

Similar News