Kodali Nani: కొడాలి నాని హెల్త్ అప్ డేట్.. బైపాస్ సర్జరీ సక్సెస్..30 రోజులపాటు అక్కడే

Update: 2025-04-04 02:51 GMT

 Kodali Nani: కొడాలి నాని హెల్త్ అప్ డేట్.. బైపాస్ సర్జరీ సక్సెస్..30 రోజులపాటు అక్కడే

Kodali Nani: క్రిష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్సీ కొడాలి నాని ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ ఇన్ స్టిట్యూట్ లో ఈనెల 2న నిర్వహించిన బైపాస్ సర్జరీ విజయవంతమైనట్లు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రి చీఫ్ సర్జన్ రమాకాంత్ పాండే సుమారు 8 నుంచి 10గంటల పాటు శస్త్ర చికిత్స చేశారు. కొన్ని రోజులపాటు నాని ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలోఉంటారు. ఆయన అవయవాలన్నీ బాగా స్పందిస్తున్నాయని వైద్యులు తెలిపారు. మరో నెల రోజులపాటు నాని ముంబైలోనే ఉంటారు. వీలైనంత త్వరగా ఆయన కోలుకుని తిరిగి రావాలని ఆశిస్తున్నామని తెలిపారు. 

Tags:    

Similar News