AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..!

AP Cabinet: పలు బిల్లులకు ఆమోదం

Update: 2023-06-07 09:15 GMT

AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..!

AP Cabinet: ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు బిల్లులను ఆమోదించింది. ఏపీగ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సీసీఎస్ ఉద్యోగుల కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తీసుకువచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 12వ పీఆర్సీ ఏర్పాటుకు చేయాలని నిర్ణయించింది. .

జగనన్న అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28వ తేదీన అమలు చేయాలని నిర్ణయించింది. 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపునకు 6 వేల 8వందల 88 కోట్ల రూపాయల ఖర్చు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం 445 కోట్ల రూపాయల రుణాల కోసం ఏపీఎఫ్ఎస్ఎల్ కు క్యాబినెట్ అనుమతినిచ్చింది. 

Tags:    

Similar News