సర్వేశ్వరుని ఆరాధన.. భక్తజన భాగస్వామ్యం.. చిలకలూరిపేటలో hmtv కార్తీక దీపోత్సవ వైభవం

Chilakaluripeta: hmtv ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం.. ఆధ్యంతం కన్నులపండువగా సాగింది.

Update: 2022-11-22 01:30 GMT

సర్వేశ్వరుని ఆరాధన.. భక్తజన భాగస్వామ్యం.. చిలకలూరిపేటలో hmtv కార్తీక దీపోత్సవ వైభవం

Chilakaluripeta: hmtv ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం.. ఆధ్యంతం కన్నులపండువగా సాగింది. కైలాసమే వేంచేసిందా అనే సంభ్రమాశ్చర్యాల మధ్య.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కార్తీక దీపోత్సవం అబ్బుపర్చింది. పీఠాధిపతుల ఆశీస్సులు, ప్రముఖుల మధ్య ఈ కార్యక్రమం.. న భూతో న భవిష్యత్‌. దివ్యభవ్య రమణీయకాంతులతో 80 అడుగుల పొడవైన కైలాసవేదికపై 40 అడుగుల ఎత్తైన హిమగిరుల మధ్య.. 20 అడుగుల ఎత్తైన పరమశివుడు కొలువుదీరాడు. గణపతి స్తుతి, వేదపఠనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో నర్మదా బాణలింగానికి మహారుద్రాభిషేకం చేయించారు. వసంతలక్ష్మీ బృందం చేత శివపార్వతుల కళ్యాణం నృత్యరూపకం ఆకట్టుకుంది. శ్రీశైలం దేవస్థానం వేదపండితులచే శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. కళ్యాణవేడుకను తిలకించి తరించారు. తర్వాత పూర్ణాహుతి చేపట్టారు. చివరగా కార్తీక దీపాలను వెలిగించి.. శివుడి అనుగ్రహాన్ని పొందారు. కైలాసమే భువిపైకి దిగివచ్చిందా అన్నట్లుగా.. hmtv కార్తీక దీపోత్సవం కన్నులపండువగా సాగింది.

Tags:    

Similar News