తోట త్రిమూర్తులు ఆ రెండు నియోజకవర్గాలు అడిగారు : వైసీపీ ఎమ్మెల్యే

Update: 2019-09-12 04:14 GMT

ఎన్నికల ముందు టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు వైసీపీలో చేరతారని అందరూ భావించారు. కానీ ఆయన మాత్రం టీడీపీలోనే ఉండి రామచంద్రపురం నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే వైసీపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక అప్పటినుంచి టీడీపీతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల రహస్యంగా కాపు నేతల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమావేశం తరువాత త్రిమూర్తులు తోపాటు టీడీపీలోని కొందరు కాపు నేతలు కూడా వైసీపీ లేదా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ త్రిమూర్తులు మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అలా అని పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. దీంతో త్రిమూర్తులు మదిలో ఏముందో అర్ధం కాక క్యాడర్ తలపట్టుకుంటుంది.

ఇదిలావుంటే తాజాగా త్రిమూర్తులు పార్టీ మార్పు విషయమై ఓ నిజం వెలుగులోకి వచ్చింది. ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరడానికి ప్రయత్నించారన్న ప్రచారం కేవలం ప్రచారమే కాదు వాస్తవం. అయితే ఆయన పెట్టిన కండీషన్లకు వైసీపీ అధిష్టానం ఒప్పుకోని కారణంగానే చేరిక జరగలేదని తెలుస్తోంది. ఈ విషయాన్నీ కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తోట త్రిమూర్తులు వైసీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయని.. కానీ ఆయన తనకు రామచంద్రపురం లేదా కాకినాడ రూరల్ స్థానాల్లో ఏదో ఒకటి ఇవ్వాలని కండీషన్ పెట్టారు. అయితే వైసీపీ అధిష్టానం తనకు మండపేట సీటును ఆఫర్ చేసింది.. దానికి ఒప్పుకోలేదు.. దాంతో త్రిమూర్తులు చేరిక జరగలేదని చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. 

Tags:    

Similar News