ఆ కీలకనేత పార్టీ మారుతారా!

ఆ కీలకనేత పార్టీ మారుతారా! ఆ కీలకనేత పార్టీ మారుతారా! ఆ కీలకనేత పార్టీ మారుతారా!

Update: 2019-09-09 05:34 GMT

ఏపీలో వలసలు మళ్ళీ ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల అనంతరం జనసేన నుంచి కొందరు నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లారు. తాజాగా మరోనేత ఆ పార్టీకి ఝలక్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయనే మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు. విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గానికి చెందిన ఆయన గడిచిన ఎన్నికల్లో పాడేరు నుంచి బరిలోకి దిగారు. కానీ డిపాజిట్లు కోల్పోయారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడం లేదు.

జనసేనాని ఇటీవల నిర్వహించిన పార్టీ మేధోమథనానికి కూడా హాజరుకాలేదు. ఈ క్రమంలో బాలరాజు వైసీపీలో చేరతారని ఏజన్సీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన పార్టీలో పాడేరు నియోజకవర్గం బాధ్యతలతోపాటు కీలకమైన నామినేటెడ్‌ పదవి కూడా ముఖ్యమంత్రి జగన్‌ అప్పగించనున్నారనే ప్రచారం జరుగుతోంది. దాంతో వైసీపీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి వర్గం ఆయన రాకను వ్యతిరేకిస్తుంది. ఆయన రాకను అడ్డుకునేందుకు భాగ్యలక్ష్మి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే బాలరాజు సీనియర్‌ నాయకుడు కావడంతో వైసీపీలో చేర్చుకోవాలని కొంతమంది పార్టీ పెద్దలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. మరి ఎమ్మెల్యే బాగ్యలక్ష్మిని కాదని బాలరాజును పార్టీలోకి తీసుకుంటారా..? తీసుకుంటే బాగ్యలక్ష్మిని ఎలా ఒప్పిస్తారో అన్న చర్చ మొదలయింది. 

Tags:    

Similar News