కరోనా సమయంలో కేంద్రం నిర్ణయాలు భేష్.. పవన్ కల్యాణ్

కరోనా వైరస్ అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. కరోనా కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉపశమన నిర్ణయాలు, మధ్యతరగతికి ఆర్థిక భరోసా ఇచ్చేలా ఉన్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

Update: 2020-06-07 13:25 GMT
Janasena Chief Pawan kalyan(File photo)

కరోనా వైరస్ అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. కరోనా కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉపశమన నిర్ణయాలు, మధ్యతరగతికి ఆర్థిక భరోసా ఇచ్చేలా ఉన్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కరోనా ప్రభావం మధ్యతరగతి ప్రజలపైనా, ఉద్యోగులపైనా విపరీతమైన ప్రభావం చూపిందని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే సొంత ఇంటి కోసంరుణాలు తీసుకునేవారికి వడ్డీ రాయితీని లక్షన్నర మేర అదనంగా ఇస్తున్నారని, అందువల్ల గృహ రుణాలు తీసుకున్న వేతన జీవులకు, చిరు వ్యాపారాలు చేసుకునేవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు.

కరోనా ప్రభావంతో కుటుంబ బడ్జెట్ తల్లకిందులవుతున్న ప్రస్తుత తరుణంలో మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందకుండా బ్యాంకులు సులువుగా రుణాలు ఇచ్చేలా ఆ రంగానికి తగిన ఉద్దీపన చర్యలు ప్రకటించడం మంచి నిర్ణయం అని పవన్ కేంద్రాన్ని పొగిడారు.

అంతేగాకుండా, బోగస్ చిట్ ఫండ్ కంపెనీలను కట్టడి చేయడం వల్ల మధ్య తరగతి ప్రయోజనాలను కాపాడగలుగుతున్నారని పేర్కొన్నారు. లిక్విడిటీ ఫెసిలిటీలో 50 వేల కోట్ల రూపాయల కేటాయించడం వల్ల మ్యూచువల్ ఫండ్స్ లో కొద్దిమొత్తాలు పెట్టుబడిగా పెట్టిన చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు నష్టపోకుండా ఉంటారని పవన్ తెలిపారు.

Tags:    

Similar News