CM Jagan: పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన

CM Jagan: పేద, మధ్యతరగతి, వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల.. తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకం

Update: 2023-12-20 09:13 GMT

CM Jagan: పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన

CM Jagan: జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహక నిధులను సీఎం వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. అర్హులైన విద్యార్థులకు 41కోట్ల 59 లక్షల నగదును.. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమచేశారు. పేద, మధ్యతరగతి, వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకమని సీఎం జగన్‌ పేర్కొన్నారు. విదేశీ విద్యాదీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్‌ యూనివర్సిటీలో చదువుతున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

Tags:    

Similar News