YSR Jayanthi: ఈసారి వేర్వేరుగా నివాళులు..?
YSR Jayanthi: రేపు వైఎస్సార్ జయంతి సందర్భంగా సీఎం జగన్, విజయమ్మ, షర్మిల ఇడుపులపాయకు రానున్నారు.
YSR Jayanthi: ఈసారి వేర్వేరుగా నివాళులు..?
YSR Jayanthi: రేపు వైఎస్సార్ జయంతి సందర్భంగా సీఎం జగన్, విజయమ్మ, షర్మిల ఇడుపులపాయకు రానున్నారు. అయితే షర్మిల తల్లి విజయమ్మతో కలిసి ఉదయమే నివాళులు అర్పించనున్నారు. జగన్ మాత్రం మధ్యాహ్నం ఇడుపులపాయకు రానున్నారు. అయితే వేరు వేరుగా నివాళులు అర్పించనుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతేడాది వైఎస్సార్ జయంతి రోజు కుటుంబం అంతా కలిసి నివాళులు అర్పించారు. వైయస్ వర్థంతి సందర్భంగా ఒకేసారి నివాళులర్పించినా..జగన్, షర్మిల మాట్లాడుకున్న సందర్భం కనపడలేదు.
ఈ సారి వేరు వేరుగా నివాళులు అర్పించడం పై వైయస్ అభిమానులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జగన్, షర్మిల మధ్య విభేదాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు షర్మిల YSRTPని కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేస్తారనే ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. షర్మిలతో పాటు కాంగ్రెస్ పెద్దలు ఇడుపులపాయకు వస్తారని.. అక్కడే.. హస్తం పార్టీలో విలీనంపై షర్మిల తన అభిప్రాయాన్ని చెప్తారనే చర్చ జరుగుతోంది.