పవన్‌కల్యాణ్‌‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్

Update: 2019-12-09 12:34 GMT
వైఎస్ జగన్ , పవన్ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్ధేశిస్తూ పరోక్షంగా విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో సోమవారం మహిళల రక్షణపై జరిగిన చర్చల్లో సీఎం మాట్లాడారు.. కఠిన చట్టాలు తీసుకొస్తామని అంటూనే చాలా మంది పెద్ద నాయకులు ఇద్దరూ ముగ్గురు భార్యలను కావాలన్నట్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

అయితే ఇలాంటి వాటిపై కూడా కేసులు ఉన్నాయని వాటినే బిగామీ కేసులు అంటారని వ్యాఖ్యానించారు. బిగామీ కేసులు రాష్ట్రంలో 2016లో 240, 2017లో 260, 2018లో 195 కేసులు నమోదయనట్లు తెలిపారు. కొందరి పెద్ద మనుషులకు ముగ్గరు భార్యలు ఉన్నారని, తనకు ఒక చెల్లి, ఇద్దరూ పిల్లలు, ఒక్కరే భార్య అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

దిశ ఉదంతంపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దిశ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్న జగన్ అలాంటి మృగాళ్లను కాల్చిచంపినా తప్పు లేదన్నారు. చట్టాలు మారాలి వేగంగా శిక్షలు విధించాలని అప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు. అందుకే, కేవలం మూడు వారాల్లోనే దోషులకు ఉరిశిక్ష పడేలా కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పర్యటనలో జనసేనాన సీఎం జగన్ పై పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్లు కొనేందుకు డబ్బులు పంచుతారు కానీ, రైతు కష్టాలు తీర్చడానికి ఏ ప్రభుత్వమూ ముందుకు రావడంలేదని విమర్శించారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవాలని, మూడు రోజుల్లో ప్రభత్వం స్పందించకపోతే తాను నిరాహార దీక్షకు దిగుతానని పవన్ స్పష్టం చేశారు. బుగ్గలు నిమిరితేనో.. కౌలిగింతలతోనో.. ముద్దులు పెడితే రైతు కడుపు నిండదని సీఎం జగన్ పై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

Full View

Tags:    

Similar News