ప్రభుత్వం అభద్రతాభావంలో ఉంది : రంగనాయకమ్మ వ్యవహారంపై స్పందించిన ఐవైఆర్

విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో విషవాయువు లీకేజీ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ గుంటూరుకు జిల్లాకి చెందన రంగనాయకమ్మ అనే 60 ఏళ్ల మహిళపై ఏపీ ప్రభుత్వం తీవ్ర చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే.

Update: 2020-05-22 14:33 GMT

విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో విషవాయువు లీకేజీ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ గుంటూరుకు జిల్లాకి చెందన రంగనాయకమ్మ అనే 60 ఏళ్ల మహిళపై ఏపీ ప్రభుత్వం తీవ్ర చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఆమెకు నోటీసులు పంపిన సీఐడీ పోలీసులు, గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో ఆమెను విచారించారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో తమకు అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకే క్రిమినల్ చర్యలు తీసుకోవడం చూస్తుంటే ప్రభుత్వం అభద్రతా భావానికి లోనైనట్టు కనిపిస్తోందని ఆయన అన్నారు. ఈ ఘటన ప్రభుత్వ నిరంకుశ ధోరణిని చాటుతోందని ట్వీట్ చేశారు. ఇప్పటి అధికారంలో ఉన్న పార్టీ గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇలాంటి అంశంపై తీవ్రంగా ఖండించింది విషయం గుర్తు చేసుకోవాలని కృష్ణ రావు పేర్కొన్నారు. విశాఖ సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురం ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టైరిన్ విష వాయువు లీక్ అయిన ఘటనలో 12 మంది చనిపోగా, వందల మంది ఆసుపత్రి పాలయ్యారు.




 


Tags:    

Similar News