కల్కి ఆశ్రమాల్లో కొలిక్కొచ్చిన ఐటీ రైడ్స్‌..తనిఖీల్లో బయటపడిన కల్కి గుట్టు

Update: 2019-10-21 11:40 GMT

కల్కి ఆశ్రమాల్లో ఐటీ రైడ్స్‌ కొలిక్కి వచ్చాయి. చిత్తూరు, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరుల్లో నాలుగైదు రోజులుగా కొనసాగుతున్న ఐటీ అధికారుల తనిఖీలు దాదాపు ముగింపుకొచ్చాయి. మొత్తం 40 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఐటీ టీమ్స్‌ ఇప్పటివరకు 300మందిని విచారించారు.

కల్కి ఆశ్రమాల్లో గుట్టలుగుట్టలుగా పడివున్న నగదును, బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 40కోట్ల ఇండియన్ కరెన్సీ, అలాగే 22కోట్ల విదేశీ కరెన్సీని సీజ్ చేశారు. ఇక, కల్కి వైట్‌ లోటస్‌‌లో తనిఖీలు ముగియడంతో అక్కడ కూడా పెద్దఎత్తున వజ్రాలు, బంగారం, దేశ, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అయితే, 85కోట్ల రూపాయలు హవాలా ద్వారా వచ్చినట్లు గుర్తించిన ఐటీ అధికారులు 5వందల కోట్ల లావాదేవీలకు లెక్కలు దొరకడం లేదని అంటున్నారు. 

Tags:    

Similar News