ISRO Space Mission: శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్ వి నారాయణన్.. 12 వ తేదీ పీఎస్ఎల్వీ-సి62 రాకెట్..!
ISRO Space Mission: ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ISRO Space Mission: ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈనెల 12 న పీఎస్ఎల్వీ-సి62 రాకెట్ ద్వారా గగనతలంలోకి పంపనున్న ఈఓఎస్-ఎన్1 విజయవంతం కావాలని ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాయకుల మండపంలో రాకెట్ నమూనాలకు, ఇస్రో చైర్మన్ నారాయణన్ కు వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ఇస్రో చైర్మన్ ను పట్టువస్త్రంతో సత్కరించి, ఇస్రో శాస్త్రవేత్తలకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.