పర్యాటకులకు అందుబాటులో లేని కాటేజీలు

తమకు ఇష్టమైన మన్యం అందాలను చూసి, ఆస్వాదించాలి అనుకునేవారు అధిక రేట్లు వెచ్చించి గుడారాలలోనే ఉంటున్నారు.

Update: 2019-11-22 08:33 GMT

చింతపల్లి: ఆంధ్రా కాశ్మీర్ గా పేరున్న లంబసింగితో పాటు ఏజెన్సీలోని పర్యాటక అందాలను తిలకించేందుకు వచ్చిన సందర్శకులకు వసతి సమస్య వెంటాడుతోంది. మధ్యాహ్నం కంటే ఉదయం, సాయంత్రం వేలల్లో మంచు దుప్పటి కప్పుకున్న మన్యం అందాలను తనివితీరా చూసి, మైమరచిపోవాలి అనుకునే ప్రకృతి ప్రేమికులతో పాటు, పర్యాటక ప్రియులకు ఇక్కడ రాత్రి బస కష్టమవుతుంది.

ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల వచ్చే పర్యాటకులు ఇక్కడ రాత్రి వేళ విడిదికి ప్రభుత్వం కాటేజీలు లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసే గుడారాలే దిక్కుగా మారుతున్నాయి. తమకు ఇష్టమైన మన్యం అందాలను చూసి, ఆస్వాదించాలి అనుకునేవారు అధిక రేట్లు వెచ్చించి ఈ గుడారాలలోనే ఉంటున్నారు. ప్రభుత్వ పరంగా వసతి సౌకర్యం, కాటేజీలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని పర్యాటకులు అంటున్నారు. 

Tags:    

Similar News