Jaggareddy: పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా చేస్తా..
Jaggareddy: ఉమ్మడి రాష్టంలో మంత్రి పదవి ఇస్తానటే వద్దని చెప్పాను
Jaggareddy: పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా చేస్తా..
Jaggareddy: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నపార్టీలో ఏ బాధ్యతలిచ్చినా చేస్తానని చెప్పానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కేసీ వేణుగోపాల్ చెప్పారన్నారు. తాను మంత్రి పదవికోసం ఎప్పుడూ మాట్లాడలేదని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి ఇస్తానంటే వద్దన్నట్లు వెల్లడించారు. రాజకీయంగా వైఎస్ఆర్ తనకు చాలా అవకాశాలిచ్చారన్న జగ్గారెడ్డి.. కష్టమైన పనిని సైతం చేయగలనని వైఎస్ఆర్ నమ్మారని తెలిపారు. గతంలో ఉన్నలీడర్ షిప్ ఇప్పుడు పార్టీలో లేదన్నజగ్గారెడ్డి.. పార్టీ సమర్థవంతులైన నాయకులను గుర్తించకపోవడం దురదృష్టమన్నారు.