అనకాపల్లి జిల్లా రాయవరంలో హోంమంత్రి అనిత పర్యటన
అనకాపల్లి జిల్లా రాయవరంలో హోంమంత్రి అనిత పర్యటన రైతన్న మీకోసం-రైతు వారోత్సవాలులో భాగంగా,.. గుడివాడలో రైతులతో ముఖాముఖీ కార్యక్రమం
అనకాపల్లి జిల్లా రాయవరంలో హోంమంత్రి అనిత పర్యటన
అనకాపల్లి జిల్లా రాయవరం మండలంలో హోంమంత్రి అనిత పర్యటించారు. రైతన్న మీకోసం - రైతు వారోత్సవాల్లో భాగంగా గుడివాడ గ్రామంలో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సాహించే విధంగా చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులకు అనిత సూచించారు. రైతులకు కూటమి అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని చెప్పారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కోనుగోలు చేసి.. వారికి గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని తెలిపారు. 24గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన హోమంత్రి అనిత అన్నారు.