పొన్నూరు మున్సిపాలిటీ వార్డులపై స్టే విధించిన హైకోర్టు

కేసు పూర్వాపరాలను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం పొన్నూరు మునిసిపాలిటీ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ నిబంధనల మేరకు జరగలేదని అభిప్రాయపడింది.

Update: 2020-02-29 12:12 GMT
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం

పొన్నూరు: మునిసిపాలిటీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 31వార్డులను మునిసిపల్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా, అధికారుల చిత్తం వచ్చినట్టు 36 వార్డులుగా మార్చిన తీరుపై ఆక్షేపణలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ మాజీ కౌన్సిలర్ అలపర్తి చంద్ర మోహన్ హైకోర్టును ఆశ్రయించారు.

కేసు పూర్వాపరాలను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం పొన్నూరు మునిసిపాలిటీ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ నిబంధనల మేరకు జరగలేదని అభిప్రాయపడింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు 20-12-2019 తేదీ దాఖలా ప్రభుత్వ గెజెట్ లో ప్రచురించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై తదుపరి చర్యలను నిలిపివేయాలని శనివారం హైకోర్టు స్టే ఉత్తర్వులను ఇచ్చింది.


Tags:    

Similar News