Heavy Rains Alert: తీవ్ర అల్పపీడనం ప్రభావం.. నెల్లూరు, చిత్తూరు సహా 4 జిల్లాల్లో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

Heavy Rains Alert: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపుగా కదిలే అవకాశం ఉందని వాతావరణశా‌ఖ వెల్లడించింది.

Update: 2025-10-23 05:25 GMT

Heavy Rains Alert: తీవ్ర అల్పపీడనం ప్రభావం.. నెల్లూరు, చిత్తూరు సహా 4 జిల్లాల్లో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

Heavy Rains Alert: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపుగా కదిలే అవకాశం ఉందని వాతావరణశా‌ఖ వెల్లడించింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రానున్న 5 రోజులు ఏపీలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది..

తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. అత్యవసర సహాయక చర్యల కోసం NDRF, SDRF బృందాలని ప్రభావిత జిల్లాలకు పంపించామని IMD తెలిపింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు.

వర్షాల నేపథ్యంలో ఇవాళ నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.

Tags:    

Similar News