మరో రెండు రోజులపాటు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

మరో రెండు రోజులపాటు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు మరో రెండు రోజులపాటు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

Update: 2019-09-23 01:57 GMT

 పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో మరో రెండు రోజులపాటు రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇటు రాయలసీమలో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలంలో 10 సెంటీమీర్లు, ధర్మవరంలో 9.4, అనంతపురం నగరంలో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కడప జిల్లాలోని చక్రాయపేట, కొండవాండ్లపల్లిలో భారీ వర్షాలు నమోదయ్యాయి. 

Tags:    

Similar News