Rain News: రెండు రోజుల క్రితం భారీగా వర్షం కురిసింది. శనివారం మాత్రం కాస్త జోరు తగ్గింది. నేడు ఆదివారం కూడా రెండు రాష్ట్రాలకు వర్ష సూచన ఉంది. ప్రయాణాలు మొదలుపెట్టుకునే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. తమిళనాడు కర్నాటక పై ఒక ద్రోణి ఉంది. దానికి అనుకూలంగా బంగాళాఖాతం నుంచి వ్యతిరేకంగా గాలులు వీస్తున్నాయి. నేడు ఏపీ, తెలంగాణతోపాటు మధ్య ప్రదేశ్, బెంగాల్, విదర్భ , సిక్కిం, బీహార్, జార్ఖండ్, ఒడిశా, కేరళ, ఛత్తీస్ గఢ్, కర్నాటలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తన తాజాగా బులిటెన్ తెలిపింది.
ఐఎండీ ఓ కీలక హెచ్చరిక కూడా జారీ చేసింది. నేుడ వర్షాలు పడే రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు కూడా వస్తాయని తెలిపింది. గాలులు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణలో మరో 4 రోజులుపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఉరుములు, మెరుపులు కూడా వస్తాయని గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.
సాయంత్రం మూడు తర్వాత మార్పు మొదలవుతుంది. రాయలసీమ, మధ్య తెలంగాణ, హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాత్రి 8గంటల వరకు ఈ పరిస్థితి ఉంటుంది. 8 తర్వాత ఉత్తరాంధ్ర, విశాఖలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడేలా ఉంది. ఈ రోజు ఏపీలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.