రెండు నెలల్లో ఇది ఐదోసారి..

Update: 2019-09-21 04:35 GMT

కర్ణాటక, రాయలసీమ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో. తుంగభద్ర జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ప్రాజెక్టు సామర్ధ్యం 101 టీఎంసీలు కాగా ప్రస్తుతం అందులో 100.855 టీఎంసీలు నిల్వ ఉంది. అయితే ఎగువనుంచి 17,275 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో 16,987 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే శ్రీశైలం జలాశయంలో కూడా 215.33 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 1.70 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. దీంతో 1.89 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. రెండు నెలల కాలంలోనే తుంగభద్ర శ్రీశైలంలో గేట్లు ఎత్తడం ఇది ఐదోసారి. పదేళ్లకిందట ఇలా జరగగా.. తాజగా ఆ పరిణామం పునరావృతం అయింది. 

Tags:    

Similar News