ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Update: 2019-09-09 02:52 GMT

మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు జారీ చేశారు. 14.10 అడుగులకు నీటిమట్టం పెరగడంతో 13.22 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. దేవీపట్నం మండలంలోని 34 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. విలీన మండలాల్లో 18 గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ముంపు ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. ఇప్పటికే చాలా మందిని ఊళ్ల నుంచి అక్కడికి తరలించారు. కొండమొదలు, కచ్చులూరు, మంటూరు, పెనికెలపాడు, గానుగ గొంది, మూలపాడు, వీరవరపులంక, ఏ వీరవరం సహా పలు గ్రామాల్లో వరద ముంచుకొచ్చింది. 

Tags:    

Similar News